గవర్నర్ సందర్శనకు విస్తృత భద్రతా ఏర్పాట్లు
జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్
బందోబస్తు సిబ్బందికి బ్రీఫింగ్
మనోరంజనీ ప్రతినిది మహబూబ్ నగర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మహబూబ్‌నగర్ జిల్లాకు అధికారిక పర్యటనలో భాగంగా పాలమూరు యూనివర్సిటీ నందు జరగనున్న నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమం మరియు IDOC కలెక్టర్ కార్యాలయం నందు జరుగనున్న అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ పాలమూరు యూనివర్సిటీ నందు పర్యటన ప్రదేశాన్ని సందర్శించి అంతరం హైటెక్ ఫంక్షన్ హాల్ లొ బందోబస్తు నందు పాల్గొనే పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు.
ఎస్పీ మాట్లాడుతూ
“గవర్నర్ పర్యటన ఎంతో ప్రతిష్ఠాత్మకం. అందువల్ల ప్రతి అధికారికి అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలి. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా రాకపోకలు, వాహనాల పార్కింగ్, మరియు భద్రతా కట్టుదిట్టతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి,” అని సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణా రెడ్డి, DTC DSP గిరిబాబు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్‌ఉద్దీన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, వుమెన్ PS ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ మగ్దూమ్ అలీ, CCS ఇన్స్పెక్టర్లు రత్నం, పరమేశ్వర్ గౌడ్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.