కాంగ్రెస్ జడ్పిటిసి టికెట్ ఎవరిది?
రాథోడ్ రాజు – పవార్ రాజు ల మధ్య హోరాహోరీ
మనోరంజని, తెలుగు టైమ్స్, సారంగాపూర్ ప్రతినిధి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల జడ్పిటిసి స్థానాన్ని ఈసారి ఎస్టీ కోటాకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ స్థానం కోసం ఇద్దరు ఆశావాహులు — మహావీర్ తాండ కు చెందిన మాజీ ఎంపీటీసీ రాథోడ్ రాజు, హనుమాన్ తాండ కు చెందిన మాజీ సర్పంచ్ పవార్ రాజు — బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరిలో తనకే టికెట్ దక్కుతుందని వారు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రాజకీయ అనుభవం, బలమైన మద్దతు, సామాజిక సేవలో వారు చూపిన చొరవ ఆధారంగా కార్యకర్తలలో చర్చ నడుస్తోంది. అయితే చివరకు టికెట్ ఎవరికీ అందుతుంది? అన్నది పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ టికెట్ ఎవరి ఖాతాలో పడతుందో వేచి చూడాల్సిందే.