ట్రంప్‌కు ఏమైంది? మరీ ఇంత దారుణమా..

ట్రంప్‌కు ఏమైంది? మరీ ఇంత దారుణమా..

ట్రంప్‌కు ఏమైంది?

మరీ ఇంత దారుణమా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టారీఫ్‌లతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అమెరికాలో బాగా బిజినెస్ జరిగే రంగాలను ఆయన టార్గెట్ చేస్తున్నారు. వాటిపై 100 శాతం టారీఫ్‌లు విధిస్తున్నారు. తాజాగా, అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం టారీఫ్ విధించారు. అయితే, అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇక, సినిమా రంగంపై టారీఫ్‌లకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘మన సినిమా బిజినెస్‌ను అమెరికా నుంచి దొంగిలిస్తున్నారు’ అని రాసుకొచ్చారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమాలపై పెద్దఎత్తున ప్రభావం పడనుంది. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలూ అమెరికాలో రిలీజ్ అయి కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఓవర్‌సీస్ సినిమా బిజినెస్‌తో మరీ ముఖ్యంగా అమెరికా బిజినెస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా లాభపడుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఈ లాభాలకు గండిపడినట్లు అవుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment