గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
𒊹 రేవంత్ సర్కార్ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
𒊹 బెనిఫిట్ షోస్ వేళలపై హైకోర్టు సందేహాలు
𒊹 ప్రజల భద్రత, సమయపాలన కోసం ఆదేశాలు
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, అర్ధరాత్రి, తెల్లవారుజామున బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. 16 ఏళ్లలోపు పిల్లలను ఈ వేళల్లో ప్రదర్శనలకు అనుమతించరాదని సూచించారు.
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు మరియు బెనిఫిట్ షోలకు సంబంధించిన వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈనెల 8న ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, రేవంత్ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
“సినిమా ప్రదర్శనలకు సమయపాలన అవసరం. అర్ధరాత్రి, తెల్లవారుజామున బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెడుతుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, 16 ఏళ్లలోపు పిల్లలను అర్ధరాత్రి మరియు తెల్లవారుజామున ప్రదర్శనలకు అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలనీ, తగిన నియంత్రణలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ నేడు కొనసాగనుంది.