ఇందిరమ్మ కమిటి లా…రాజకీయ కమిటిలా కమిటీల్లో మాజీ సర్పంచులు ఉండడం ఏంటి?

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 13

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం అర్హుల ఎంపిక చేయడానికి హుటాహుటిన ఇందిరమ్మ కమిటీలు వేయాలని ఆదేశాలు ఇవ్వడంతో గ్రామాల్లో రాజకీయరచ్చ మొదలైంది. కమిటీలు పారదర్శకంగా ఉండేలా ఉండాలని ప్రజలు భావిస్తుండగా, ఇందులో రాజకీయాలు వచ్చేసాయి. కమిటీలో తమ పేర్లుండాలని తాజా మాజీ సర్పంచ్ లు రాజకీయ నాయకుల ద్వారా అధికారులకు ఒత్తిడి చేయిస్తున్నారు. కమిటీల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఒక్కొక్కరు ఇద్దరు డ్వాక్రా మహిళలు ఉండాలని ప్రభుత్వం సూచించినప్పటికీ కమిటీల్లో తాజా మాజీలు అరంగేట్రం చేయడానికి ప్రయత్నించడంతో ఇవేం కమిటిలంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా అధికార పార్టీ నాయకుల ఆదేశాలను అధికారులు పాటిస్తుండడంతో ఇందిరమ్మ కమిటీలు రాజకీయ వేదికలుగా మారనున్నాయి. ఇకనైనా పారదర్శకంగా కమిటీలు వేయాలని ప్రజలు కోరుతున్నారు

Leave a Comment