కాంగ్రెస్ లో అసలు ఎం జరుగుతుంది

: కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన

జెండా మోసిన వారికి పంగ నామాలేనా!.

పని చేసిన వారికీ పదవులు దక్కవా

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 26

కష్ట కాలం లో ఉన్నవారికి ఇదేనా ఇచ్చే గౌరవం..
అసెంబ్లీ ఎన్నిక ల సమయం లో కనీసం పోటి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు.. ఆ సమయం లో మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ కాంగ్రెస్ పార్టి లో చేరారు.. ఇక్కడ కాంగ్రెస్ కు ఎన్నికల సమయం లో గడ్డు పరిస్థితులు. అయినా ఉన్న క్యాడర్ తో ప్రజా క్షేత్రం లో పోటి చేసి నారాయణ్ రావ్ పటేల్ పార్టీ పరువు కాపాడారు..పార్టీ అధికారం లోకి రావడం తో నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనకుంటే ప్రస్తుత పరిణామల తో అసలు క్యాడర్ కే అన్యాయం జరుగుందని కార్యకర్తలు వాపోతున్నారు.. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అధికార పార్టి లో చేరడం తో వర్గ విభేదాలు ప్రారంభం అయ్యాయి..భైంసా మార్కెట్ చైర్మన్ గా ఆనంద్ రావ్ పటేల్ ని నియమించడం సముచితం అయినప్పటికి వైస్ చైర్మన్, డైరెక్టర్ ల నియామకం లో అన్యాయం జరిగిందని కార్యకర్త లు అంటున్నారు.. పార్టి కోసం అహో రాత్రులు శ్రమిస్తే వలస వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.. బి. ఆర్. ఎస్. అధికారం లో ఉన్న సమయం లో వారే డైరెక్టర్ లు, కాంగ్రెస్ పార్టి వచ్చాక వారే మార్కెట్ కమిటి డైరెక్టర్ లు కావడం తో అధిష్టానం తో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.. కాంగ్రెస్ పై అభిమానం తో పని చేసిన కార్యకర్త లకు పదవులు ఇవ్వకుండా వారి అవసరం కోసం అధికార పార్టి లో చేరిన వారికి పదవులు ఇవ్వడం తో ఈ విషయం లో మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. పి. సి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఢిల్లీ పెద్దలను సైతం మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావ్ పటేల్ కలుస్తారని కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది.. భైంసా మార్కెట్ కమిటి పాలక వర్గాన్ని నియమించినప్పటికి, కుబీర్ మార్కెట్ కమిటి నియామకం ఎందుకు చేపట్టలేదని భైంసా లో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అధిష్టానాన్ని ప్రశ్నించ్చారంటే కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఎంత తార స్థాయికి చేరయో స్పష్ట మవుతుంది..దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని మండి పడుతూ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డీ పాలక వర్గాన్ని తన హయం లో ఎందుకు ఏర్పాటు చేయాలేదన్నారు. తక్షణమే కుభీర్ మార్కెర్ కమిటి పాలక వర్గాన్ని నియమించాలని డిమాండ్ చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment