తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ సంఘం నిస్వార్థంగా పని చేస్తుంది

తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ సంఘం నిస్వార్థంగా పని చేస్తుంది

తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ సంఘం నిస్వార్థంగా పని చేస్తుంది

పంది వెంకట్ రాంరెడ్డి, డివిజన్ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం,

తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం షాద్ నగర్ డివిజన్ కమిటీ సమావేశం అధ్యక్షులు పంది వెంకట్ రాంరెడ్డి అధ్యక్షతన షాద్ నగర్ బైపాస్ ఎమ్మి హోటల్ లో జరిగింది. ఈ సమావేశంలో రాబోవు రోజుల్లో ఉద్యమ కారుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సాదించేవిధంగా కృషి చేయాలని తీర్మానించారు.అలానే మండల కమిటీలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలనీ, ముందుగా జనవరి 26 నాడు ఫరూక్ నగర్ మండల కమిటీ మరియు షాద్ నగర్ పట్టణ కమిటీ ల ఎన్నిక, జనవరి 27 నాడు కొందుర్గ్, చౌదరి గూడ మండల కమిటీ ల ఎన్నిక జరపాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా వెంకట్ రాంరెడ్డి రమాట్లాడుతూ,,షాద్ నగర్ డివిజన్ కమిటీ ఎన్నిక తరువాత కేవలం కేశంపేట మండల కమిటీ నీ ఎన్నుకోవడం జరిగింది. అని, మధ్యలో కొంత ఆలస్యం జరిగిందనీ, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉద్యమ కారుల కు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు, కనుక ఈ నెలలో అన్నీ మండల కమిటీ లు పూర్తి చేసి, నిజమైన ఉద్యమ కారులను గుర్తించి, వారి వివరాలను డివిజన్ కమిటీ కి తెలియజేయాలని, అందుకొరకు మండల కమిటీ లు, పట్టణ కమిటీ లు పూర్తి చేయటం కొరకు 26, 27 తేదీలలో ఫరూక్ నగర్, కొందుర్గ్, చౌదరీ గూడ, షాద్ నగర్ పట్టణ కమిటీ లు ఎన్నుకుంట్టునట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పినపాక ప్రభాకర్, సలహా దారులు నక్కల వెంకటేష్ గౌడ్, కో కన్వీనర్లు జంగారు నరసింహ, మహ్మద్ సిరాజూద్దీన్,ఉపాధ్యక్షులు ఆర్ల యాదయ్య, జంగారి రవి, సిద్దల శ్రీనాథ్ , కో ఆర్డినేటర్ మామిడి పల్లి శరత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment