పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు

ఎమ్4 న్యూస్
తెలుగు రాష్ట్రాలు, అక్టోబర్ 12, 2024

 

  • దసరా పర్వదినం నుంచి డిసెంబర్ వరకు వరుసగా పెళ్లి ముహూర్తాలు.
  • పెద్ద ఎత్తున పెళ్లిళ్లకు అడ్వాన్స్ బుకింగ్‌లు, మార్కెట్లో పండుగ వాతావరణం.

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. దసరా పర్వదినమైన అక్టోబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ వరకు వరుసగా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. ఫంక్షన్‌హాళ్లు, డెకరేషన్, కేటరింగ్ రంగాల్లో బిజీ సీజన్ రానుంది. నవరాత్రి నుంచి కొత్త ఏడాది వరకు పెళ్లిళ్ల కోసం పెద్ద ఎత్తున బుకింగ్‌లు జరుగుతుండగా, బట్టలు, బంగారం, కిరాణా దుకాణాలు కూడా గిరాకీతో కళకళలాడనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైంది. ఆగస్టు నెలలో చివరగా పెళ్లి ముహూర్తాలు ఉండగా, మధ్యలో 40-45 రోజుల విరామం తరువాత అక్టోబర్ 5వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు వచ్చాయి. ముఖ్యంగా అక్టోబర్ 12వ తేదీ దసరా పర్వదినం నుంచి డిసెంబర్ వరకు సుమారు 25 రోజులు వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ఫంక్షన్‌హాళ్లు, బ్యాంకెట్‌హాళ్లు ముందస్తుగా బుకింగ్‌లు చేయించుకుంటున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అనేక శుభకార్యాలు జరగనున్నందున డెకరేషన్, కేటరింగ్, బ్యాండ్ తదితర సేవలకు భారీ ఆర్డర్లు వస్తున్నాయి.

తద్వారా బట్టలు, బంగారం, వాహనాలు, కిరాణా దుకాణాలకు గిరాకీ ఉండనున్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ పెళ్లిళ్ల సందడి మూడు నెలల పాటు కొనసాగుతుండడంతో అన్ని వర్గాల్లో మళ్ళీ శుభకార్యాల పండుగ వాతావరణం ఏర్పడింది.

Leave a Comment