హైదరాబాద్, జులై 26
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.












