హైదరాబాద్, జులై 23
గుజరాత్లో గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్, నవసారి, సూరత్ జిల్లాల్లో వరదలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
గుజరాత్లో గురువారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్, నవసారి, సూరత్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వరదలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రభావిత జిల్లాల్లో సహాయక, పునరావాస చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వి, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి నరేష్ పటేల్‌తో పాటు కార్యదర్శులు రమ్య మోహన్, అలోక్ పాండేలు వెంటనే సూరత్, వల్సాద్, నవసారి జిల్లాలకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో ఇన్చార్జ్ కార్యదర్శులు అక్కడే ఉండి స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయట కు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.












