Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు, జాగ్రత్త..!!

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు, జాగ్రత్త..!!

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు, జాగ్రత్త..!!

Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలలో వర్షాలు అంతగా కొట్టలేదు. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి.

ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, గత నాలుగు, ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతాయని తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు వివరించింది. ఇప్పటికే భారీ వర్షాల వల్ల ఉత్తర తెలంగణలోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతున్న విషయం తెలిసిందే. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని వివరించారు.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో మరి కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మరోవైపు కృష్ణా బేసిన్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ పరివాహాక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని నారాయణ్‌పూర్, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టులు నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటికే రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్తత్తి చేసి నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు.

అయితే.. ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు

Join WhatsApp

Join Now

Leave a Comment