జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం

జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం

జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం

స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎంపిటిసి, జడ్పీటిసి నామినేషన్ల సందర్భంగా కఠిన పోలీసు బందోబస్తు

నామినేషన్ కేంద్రాల వద్ద నిభందనలు తప్పనిసరి పాటించాలి

ఎన్నికల ప్రశాంత వాతావరణం కోసం బైండోవర్ చర్యలు, చెక్‌పోస్టులు ఏర్పాటు

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవు

::::: జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ తెలియజేశారు.

ఎన్నికల నియమనిబంధనల మేరకు నిర్మల్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమలు చేస్తాము. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లా ప్రజలు, పౌరులు రాజకీయ పార్టీలు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్నారు. ఒకవేళ ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డయల్ 100 కు లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659555 , వాట్సాప్ నంబర్ 8712659599 కు సమాచారం ఇవ్వాలి అని తెలియ జేశారు.

గత ఎన్నికలలో కేసుల్లో ఉన్న నేరస్థులను ముందస్తుగా బైండోవర్ చేయడం, సమస్యలు సృస్థించే ట్రబుల్ మాంగర్స్ ను, రౌడీలను, కేడిలను, సస్పెక్ట్ లను ముందస్తు బైండోవర్ చేస్తాం అని, జిల్లాలో ఉన్న ఆయుధాలను ముందస్తుగా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు.

జిల్లా ఎస్పీ ప్రధాన సూచనలు:

🔹 ఎన్నికల కోడ్ అమలు:
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 11 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

🔹 ఎలక్షన్ సెల్ ఏర్పాటు:
జిల్లాలో ప్రత్యేక ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేసి, అనుభవజ్ఞులైన అధికారులను, సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. ఈ సెల్ మొత్తం ఎన్నికల సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు.

🔹 చెక్ పోస్టులు:
ఏడు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని మరియు ఇప్పటికే జిల్లాలో వ్యాప్తంగా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని,అక్కడ ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

🔹 బైండ్ ఓవర్ చర్యలు:
గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల నేరాలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీ షీటర్లను సంబంధిత రెవెన్యూ అధికారుల ముందు బైండ్ ఓవర్ చేయాలని సూచించారు.

🔹 నగదు పరిమితి:
సరైన ఆధారాలు లేకుండా ₹50,000 కంటే ఎక్కువ నగదు వెంట తీసుకువెళ్లరాదని, ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నగదు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

🔹 సోషల్ మీడియా
సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా రూమర్స్ సృష్టించడం లాంటివి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే సంభందిత వ్యక్తులు, వాట్సప్ అడ్మిన్ లపై చట్టపరమైన చర్యలు తప్పవు అని ఎస్పీ హెచ్చరించారు.

అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలు మాత్రమే ఉపయోగించాలి. ఊరేగింపులు, ర్యాలీలు కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు రేకెత్తించే విధంగా ఉండరాదు.

వాహనాలపై లౌడ్‌స్పీకర్ల వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రతి వాహనానికి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పర్మిట్ ఒరిజినల్ కాపీ కలిగి ఉండాలి.

నామినేషన్ దాఖలుచేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఉంటుంది.

కార్యాలయంలోకి ప్రవేశం ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థి మరియు అర్హులైన సహాయకులకు మాత్రమే ఉంటుంది.

అభ్యర్థులు మరియు పార్టీలు చట్టపరమైన నియమాలు పాటించి, శాంతి భద్రతలతో ఎన్నికలు జరగడానికి సహకరించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు

Join WhatsApp

Join Now

Leave a Comment