- హైదరాబాదులో అన్ని డివిజన్ కమిటీల నిర్మాణం
- పేద ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలో కార్యచరణ
- అవినీతి, అక్రమాలపై పోరాటం
- ఎన్ హెచ్ ఆర్ సి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు వల్లెం భరత్ రాజ్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని డివిజన్ కమిటీల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని ఎన్ హెచ్ ఆర్ సి గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు వల్లెం భరత్ రాజ్ తెలిపారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రధాన ధ్యేయంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు నిరసనగా సంస్థ ముందుకు సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
నవంబర్ 25, 2024న ఎల్బీనగర్లో జరిగిన సమావేశంలో, జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు వల్లెం భరత్ రాజ్, నగరంలోని అన్ని డివిజన్ కమిటీల నిర్మాణం త్వరలో పూర్తి అవుతుందని వెల్లడించారు. ఈ ప్రకటన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్ల భద్రయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి రిటైర్డ్ జెడి కేశమౌని యాదయ్య గౌడ్ ఆదేశాల మేరకు జరిగింది.
భరత్ రాజ్ మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడం, ప్రభుత్వానికి వారధిగా నిలవడం, పేద ప్రజల సమస్యల పరిష్కారం వంటి ముఖ్య లక్ష్యాలు తమ సంస్థకు ఉన్నాయని తెలిపారు. అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మేధావులు, విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులను తమ కార్యక్రమాల్లో భాగస్వాములుగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో 13 జిల్లా కమిటీలను విజయవంతంగా పూర్తి చేసిన ఈ సంస్థ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఈ డివిజన్ కమిటీల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు నాగసాయి సంపత్, లయన్ మురళీ మనోహర్, సుబ్బారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.