“మేము ఉన్నామంటూ…” – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సహాయ హస్తం

“మేము ఉన్నామంటూ…” – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సహాయ హస్తం

బంధువులెవరూ ముందుకు రాకపోయినా, ఫౌండేషన్ చేపట్టిన అంతిమ సంస్కార సేవలు

ప్రొద్దుటూరు, జూలై 31 (మనోరంజని ప్రతినిధి):

"మేము ఉన్నామంటూ..." – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సహాయ హస్తం

తాళ్లమాపురం గ్రామానికి చెందిన తాడిపత్రి శ్రీను అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించారు. అయితే ఆయన బంధువులెవరూ అంతిమ సంస్కారాల కోసం ముందుకు రాకపోవడంతో, గ్రామస్థులు ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ ను ఫోన్ ద్వారా సంప్రదించారు.

వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు, శ్రీను అంతిమ సంస్కారాలను హిందూ సంప్రదాయ ప్రకారంగా ప్రొద్దుటూరు హిందూ స్మశాన వాటికలో ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి పలు సంస్థలు కలిసి చేయూతనిచ్చాయి.

సహకరించినవారు:

  • మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు

  • టౌన్ ప్రెసిడెంట్ సుబహన

  • కృపా ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు రమేష్, ప్రసన్న కుమార్ తదితరులు

ఈ చర్యపై ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. “మానవత్వం మరిచిపోతున్న రోజులలో, ఇలాంటి సేవా సంస్థలు మన సమాజానికి ఆశాజ్యోతి” అని స్థానికులు అభిప్రాయపడ్డారు.


శ్రీ అమ్మ శరణాలయ వృద్ధాశ్రమానికి సహాయం చేయదలచిన దాతలు సంప్రదించాల్సిన నెంబర్లు:

📞 82972 53484

📞 91822 44150

Join WhatsApp

Join Now

Leave a Comment