వైద్య,విద్య రంగాలకు పెద్దపీట : మంత్రి వివేక్ వెంకటస్వామి!

వైద్య,విద్య రంగాలకు పెద్దపీట : మంత్రి వివేక్ వెంకటస్వామి!

వైద్య,విద్య రంగాలకు పెద్దపీట : మంత్రి వివేక్ వెంకటస్వామి!

 మంచిర్యాల జిల్లా:ఆగస్టు 03*

విద్య వైద్య రంగాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం పట్టణంలోని కాకతీయ కాలనీలో ఆధునికరించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో రేషన్ కార్డులు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా మంత్రి వివేక్,మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ”200 కోట్లు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్వహిస్తుందన్నారు. నియోజకవర్గంలో రూ “500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టమన్నారు.
దీనిలో భాగంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడు తూ… అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డిజిపి భాస్కర్ డీఈఓ యాదయ్య, తాసిల్దార్ సతీష్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment