నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం

Alt Name: సెమీ హైస్పీడ్ రైలు
  • సెమీ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందస్తు సర్వే
  • ప్రాజెక్టు పూర్తయితే కేవలం 4 గంటల్లో విశాఖపట్నానికి చేరుకోగలగడం

భారతీయ రైల్వే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్‌ ను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా శంషాబాద్ నుంచి విశాఖపట్నానికి కేవలం నాలుగు గంటల్లో చేరుకోవడం సాధ్యమవుతుంది. ప్రాజెక్టు పూర్తయితే వందే భారత్ వంటి రైళ్లతో పోలిస్తే మరింత వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక ప్రణాళికలు రూపొందించింది. శంషాబాద్ నుంచి విశాఖపట్నం (దువ్వాడ) వరకు సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైలు వేగాన్ని గంటకు 220 కిలోమీటర్లుగా ఉంచిన ఈ ప్రాజెక్ట్‌ తో హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 12 గంటల నుంచి కేవలం నాలుగు గంటలకు తగ్గవచ్చని అంచనా. ఈ కొత్త మార్గం సూర్యాపేట, విజయవాడ మీదుగా నడవనుంది.

ప్రాజెక్టు ప్రారంభం కోసం అవసరమైన ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్ సర్వే (PET) తుది దశకు చేరుకోగా, నవంబర్‌లో రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించనున్నారు. ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ మరియు రాజమహేంద్రవరం వంటి విమానాశ్రయాలకు రైలు అనుసంధానం కల్పించబడుతుంది. ప్రాజెక్టు అమలవుతోందని గనక ఈ సెమీ హైస్పీడ్ రైలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు వేగవంతమైన రవాణా సాధనంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment