*వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలి*
*భైంసా లోని హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశమైన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్*
భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో, జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, భైంసా పట్టణ హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ –*
ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నుండి వినాయక విగ్రహాల నిమజ్జనం వరకు శాస్రోత్తకంగా,హిందూ సంప్రదాయ బద్దంగా చాలా సంతోషంగా జరుపుకోవాలని తెలియజేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్, భైంసా పట్టణ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.