వశిష్టలో ఘనంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు
బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 4
భైంసా పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో వినాయకుని నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుని విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోలీవార్ వెంకటేష్, యాజమాన్య సభ్యులు సాత్వే గంగాధర్. బొమ్మ నవీన్, పొలాస ధరంపురి నందగిరి సంతోష్, లఖాన్, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.