విద్యుత్ అధికారుల పల్లె బాట
మనోరంజని, తెలుగు టైమ్స్ – నిర్మల్ ప్రతినిధి, అక్టోబర్ 24
తెలంగాణ ఏన్పీడీసీల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కొమ్మెరా సెక్షన్ పరిధిలోని సోమన్‌పల్లి గ్రామంలో “పల్లె బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులకు అధికారులు పలు సూచనలు, సలహాలు అందించారు. విద్యుత్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలి, విద్యుత్ పొదుపు కోసం ఎల్ఈడీ బల్బులు వాడాలని సూచించారు. నాసిరకం వైర్లు, స్విచ్‌లు వాడకూడదని హెచ్చరించారు. ప్రతి ఇంటికి సరైన ఎర్తింగ్ ఉండాలనీ, ఫ్రిజ్‌లు, కూలర్లు వంటి ఉపకరణాలకు కూడా ఎర్తింగ్ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఇంటి విద్యుత్ సదుపాయాల్లో నాణ్యమైన సర్వీస్ వైరు, డీపీ మెయిన్ స్విచ్, ఫ్యూజ్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యుత్ లైన్లకు కొండీలు వేయకూడదని, భద్రతతో కూడిన విద్యుత్ వినియోగం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1912 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ రాజా మల్లు, లైన్మెన్లు సత్తయ్య, సురేష్, ఇతర విద్యుత్ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.