బాధితులను కలవనున్న విజయ్.. 50 గదులు బుక్
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో విజయ్ బాధిత కుటుంబాలను కలవనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారంచెన్నై సమీపంలోని రిసార్టులో వారిని పరామర్శించనున్నారు.
అందుకోసం టీవీకే పార్టీ.. రిసార్టులో 50 గదులను బుక్ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి