చిరంజీవి సినిమాలో నటించనున్న విక్టరీ వెంకటేష్

చిరంజీవి సినిమాలో నటించనున్న విక్టరీ వెంకటేష్

చిరంజీవి సినిమాలో నటించనున్న విక్టరీ వెంకటేష్

మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025

మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “మన శంకర వరప్రసాద్ \”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇటీవల విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక అక్టోబర్ 5 నుంచి వెంకటేష్ షూటింగ్‌లో పాల్గొననున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుస్మిత, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment