తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, సీఎం
తిరుమల, మనోరంజని ప్రతినిధి
తిరుమలలో శ్రీవారిని ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు.
మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ఏ.కే. సింఘాల్ ఆలయ మర్యాదలతో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరికి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.