సురక్షిత దీపావళికి వేములవాడ పోలీసుల సమగ్ర మార్గదర్శకాలు

సురక్షిత దీపావళికి వేములవాడ పోలీసుల సమగ్ర మార్గదర్శకాలు

సురక్షిత దీపావళికి వేములవాడ పోలీసుల సమగ్ర మార్గదర్శకాలు

మనోరంజని తెలుగు టైమ్స్ వేములవాడ ప్రతినిధి అక్టోబర్ 19

వేములవాడ ప్రజలు, పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు. ఆయన ఆధ్వర్యంలో వేములవాడ పోలీస్ విభాగం మార్గదర్శకాలను జారీ చేసింది. లైసెన్స్ పొందిన విక్రేతల వద్దే పటాకులు కొనుగోలు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లోనే కాల్చాలని, మండే వస్తువులకు దూరంగా ఉండాలని, కాటన్ దుస్తులు ధరించాలని, పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే కాల్చాలని సూచించారు. నీరు, అగ్నిమాపక యంత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని, వెలిగించని పటాకులను తిరిగి వెలిగించరాదని, ఇళ్లలో, మూసివేసిన ప్రదేశాల్లో పేల్చడం నిషిద్ధమని, మనుషులు, జంతువులపై విసరరాదని హెచ్చరించారు. దీపాల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment