*ఆటో డ్రైవర్లకు దసరా నుంచి వాహన మిత్ర పథకం!*
*మనోరంజని ప్రతినిధి అమరావతి సెప్టెంబర్11*
కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము నష్టపోతున్నామం టూ ఆవేదన చెందుతున్న ఆటో డ్రైవరన్నలకు ఉపశమనం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
దసరా నుంచి ‘వాహన మిత్ర’ అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటిం చారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభలో ఆయన మాట్లాడుతూ….. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం (స్త్రీ శక్తి) అమలు వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి ప్రభావితం కాకుండా చూసేందుకు ప్రత్యేక సాయం అందిస్తా మని గతంలో ప్రకటించా రు. ఆ మేరకు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు అందించాలని నిర్ణయించా రు. ఇదీ ప్రజా ప్రభుత్వం: చంద్రబాబు ‘‘సూపర్ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం. జవాబు దారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వమన్నారు.
ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి చరిత్ర తిరగరాశారు. తెలుగు తమ్ముళ్ల స్పీడు.. జనసేన జోరు.. కమలదళం ఉత్సాహానికి ఎదురుందా? నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది పాలనను గాడిలో పెడుతున్నాం.
స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఉచితంగా బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి రూ.15వేలు ఇచ్చాం. తల్లికి వందనం అమలు చేసి తల్లుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారు. ’’ అని చంద్రబాబు తెలిపారు.
రైతన్నకు అండగా ఉండేం దుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో వెలుగులు నింపాం కాబట్టే దీపం పథకం సూపర్ హిట్ అయింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం.’’ అని చంద్రబాబు తెలిపారు.