వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి
భైంసా లోని విశ్రాంతి భవనం ముందర రజకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ
ఐలమ్మ జీవిత చరిత్రను పూర్తి స్తాయిలో పాఠ్యాంశం గా చేర్చాలి.ప్రభుత్వం ఈ రోజు సెలవు దినంగా ప్రకటించాలి.
అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఐలమ్మ చిత్రపటం లేదు వెంటనే ఏర్పాటు చేయాలి.భూమికోసం ప్రజల విముక్తి కోసం పోరాడిన తల్లి ని తెలంగాణా తల్లిగా గుర్తింపు ను ఇవ్వాలని డిమాండ్ చేశారు.రజకుల చిరకాల వాంఛ రజకులను ఎస్సి జాబితా లో చేర్చాలని కోరారు.
దొరలను భూస్వాములను తరిమి కొట్టి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన మహనీయురాలని గుర్తుచేశారు
ఐలమ్మ ఆశయ సాధన కోసం అందరు క్రుషి చేయాలని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో రజక సంఘం నాయకులు శ్రీనివాస్, సాయినాథ్, భూమన్న, రాజు mrps జాతీయ నాయకులు నందు,ఆనంద్, సాయి చంద్ ఆనంధిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.