వసుంధర పాయి దిండి పాదయాత్ర విజయవంతం — గోడాపూర్ భక్తులకు ఘన స్వాగతం
శ్రీ రామానంద చార్య నరేంద్ర చార్య మహారాజ్ ఆశీస్సులతో 700 కిలోమీటర్ల ఆధ్యాత్మిక పయనం — భక్తుల సేవా స్పూర్తికి గ్రామస్తుల సత్కారం
మనోరంజని తెలుగు టైమ్స్ కుబీర్ ప్రతినిధి అక్టోబర్ 26
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం, గోడాపూర్ గ్రామానికి చెందిన భక్తులు
శ్రీ రామానంద చార్య నరేంద్ర చార్య మహారాజ్ వసుంధర పాయి దిండి (పాదయాత్ర) లో భాగంగా భక్తులు చేపట్టిన ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొని విజయవంతంగా ముగిసింది. తెలంగాణ పీఠం కామారెడ్డి జిల్లా జుక్కల్ నుంచి మహారాష్ట్ర రత్నగిరి జిల్లా నానిజ్ ధాం వరకు సుమారు 700 కిలోమీటర్ల దూరాన్ని 30 రోజుల్లో పూర్తి చేసిన ఐదుగురు భక్తులు స్వగ్రామం గోడాపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా యాత్రికులు బి. గంగాధర్, ఏ. శంకర్, టి. మారుతి, డబ్ల్యూ. రేష్మాజిక్, జే. దత్తాత్రిలను గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ పాఠశాల చైర్మన్ మోరే అవినాష్ మాట్లాడుతూ, “యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆధ్యాత్మిక మార్గంలో పయనం చేయాలి. భక్తి, సేవతో సాగిన ఈ పాదయాత్ర మనసుకు ఉల్లాసాన్ని, ఆత్మకు శాంతిని కలిగిస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులను ఆహ్వానించి సత్కరించారు. గోడాపూర్ గ్రామం అంతా భక్తి స్ఫూర్తితో మార్మోగింది.