వాసిరెడ్డి పద్మ వైసీపీ పార్టీకి రాజీనామా?

Vasireddy Padma Resigns from YSRCP Party
  • వైసీపీకి మరో ఎదురు దెబ్బ, వాసిరెడ్డి పద్మ రాజీనామా.
  • జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఆశించిన వాసిరెడ్డి పద్మకు నిరాశ.
  • సీటు ఆశించకపోవడంతో వాసిరెడ్డి పద్మ పార్టీకి దూరం.

 

వైఎస్సార్‌సీపీకి సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఆశించిన వాసిరెడ్డి పద్మకు ఆ అవకాశం లేకపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రచారం ఉంది. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖను వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు పంపించారు.

 

అమరావతి: అక్టోబర్ 23

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైఎస్సార్‌సీపీని వీడుతూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికల తర్వాత పార్టీలో నుండి పలువురు సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న క్రమంలో వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం పార్టీలో కుదుపు తీసుకొచ్చింది.

వాసిరెడ్డి పద్మ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట సీటు ఆశించినప్పటికీ, ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఇటీవల జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా తన్నీరు నాగేశ్వరరావును నియమించడం వలన ఆమెకు మరింత నిరాశ కలిగిందని ప్రచారం ఉంది. వాసిరెడ్డి పద్మ రాజీనామాతో వైసీపీకి మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment