వైభవంగా జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు

జ్ఞాన సరస్వతి దేవాలయం వసంత పంచమి వేడుకలు
  1. 300 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, 20 మందికి అన్నప్రాసన ఘనంగా నిర్వహణ.
  2. వివిధ జిల్లాల నుండి వేలాది భక్తుల హాజరు, భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం.
  3. ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలతో అమ్మవారికి విశిష్ట సేవలు.
  4. అన్నప్రసాద విరణ, భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించిన ఆలయ కమిటీ.

 జ్ఞాన సరస్వతి దేవాలయం వసంత పంచమి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో 14వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వసంత పంచమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 300 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం, 20 మందికి అన్నప్రాసన నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అన్నప్రసాద విరణలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.

 జ్ఞాన సరస్వతి దేవాలయం వసంత పంచమి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కొల్లాపూర్ చౌరస్తా వద్దగల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో 14వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నప్రసాద విరణం నిర్వహించారు.

ఈ వేడుకల్లో భాగంగా చిన్నారుల విద్యాభ్యాసానికి శుభారంభమైన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆలయ వేదపండితులు వేద మంత్రోచరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మందికిపైగా చిన్నారులు పాల్గొన్నారు. అలాగే, 6 నెలలు నిండిన 20 మందికిపైగా చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని ఆలయ ఆవరణలో నిర్వహించారు.

ప్రధాన అర్చకులు పి. నవీన్ కుమార్ శర్మ బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని, విద్యా ఐశ్వర్యాలను కోరుకున్నారు. ఆలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ఆలయ నిత్య అన్నప్రసాద కమిటీ భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని వితరణ చేయగా, వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వలిశెట్టి లక్ష్మి, శేఖర్, శివశంకర్, బాలస్వామి, వరలక్ష్మి, శారద, కన్నమ్మ, లలిత, రవి, దొడ్ల నారాయణ రెడ్డి, ఇందుమతి, మాధవి, భూపాల్ రెడ్డి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment