పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణ లక్ష్మి పథకం
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 17
పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ పథకాలు వరమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు ముధోల్లోని క్యాంప్ కార్యాలయం, బాసరలోని తహసీల్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు పరిష్కారానికి తనవంతుగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరుతో పాటు రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, తహసిల్దార్ శ్రీలత, బిజెపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, ఏఎంసీ డైరెక్టర్ రమానాథ్ రాథోడ్, మాజీ సర్పంచులు గంట శ్రీనివాస్, నిమ్మపోతన్న, శ్వేతా రవి కిరణ్ గౌడ్, స్వర్ణలత దత్తాత్రి, మాజీ ఎంపిటిసిలు లక్ష్మీనారాయణ, దేవోజి భూమేష్, బీడీసీ మాజీ అధ్యక్షుడు గుంజలోళ్ళ నారాయణ, నాయకులు సతీష్ రెడ్డి, మోహన్ యాదవ్, తాటివార్ రమేష్, లడ్డు పోతన్న, జీవన్, మేత్రి సాయినాథ్, బత్తినోళ్ల సాయినాథ్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు