పేదింటి ఆడపిల్లలకు వరం… కల్యాణ లక్ష్మి పథకం

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

ముధోల్: అక్టోబర్ 17, 2024

పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సాకారం చేస్తున్నాయని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తం 100 మంది లబ్ధిదారులకు కోటి రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శ్రీకాంత్, బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ జడ్పిటిసిలు లక్ష్మీ నర్సాగౌడ్, వసంత రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment