కూరగాయల మార్కెట్ సముదాయానికి గుండా మల్లేష్ నామకరణం సమంజసమే: వడ్డేపల్లి రామచందర్

: గుండా మల్లేష్ పేరు మార్కెట్

కూరగాయల మార్కెట్ సముదాయానికి గుండా మల్లేష్ నామకరణం సమంజసమే: వడ్డేపల్లి రామచందర్

M4 న్యూస్ (ప్రతినిధి)

బెల్లంపల్లి: అక్టోబర్ 19

శనివారం, ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్‌ను ఎన్టిపిసి టౌన్షిప్ జ్యోతిభవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, బెల్లంపల్లి పట్టణంలో కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సముదాయానికి సిపిఐ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గుండా మల్లేష్ పేరును పెట్టడం సముచితమని ఆయనకు తెలియజేశారు.

గుండా మల్లేష్ గతంలో కూరగాయల మార్కెట్ కాలిపోయిన సమయంలో, తన సొంత ఖర్చులతో మార్కెట్ నిర్వాసితులకు సహాయం చేసి, మార్కెట్ పునఃప్రారంభానికి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దీనిని గుర్తించి, మార్కెట్ సముదాయానికి ఆయన పేరు పెట్టడం సమంజసమేనని వాదించారు.

వడ్డేపల్లి రామచందర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించి, దీనిపై అధికారులతో చర్చించి గుండా మల్లేష్ పేరును అధికారికంగా పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment