మరో 6 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, సిరిసిల్ల, KNR జిల్లాల్లో సెలవు ఇచ్చారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది