రక్తదానంతో మరెందరికో ఉపయోగం..

రక్తదానంతో మరెందరికో ఉపయోగం..

ఎస్ఆర్ఆర్ లో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రిన్సిపల్ కల్వకుంట రామకృష్ణ

కరీంనగర్, ఆగస్టు, 25

దాది ప్రకాష్ మణి 18వ స్మృతి దినోత్సవాన్ని పురస్కరించుకొని
బ్రహ్మకుమారిస్ సమాజ సేవ విభాగం ఆధ్వర్యంలో సోమవారం
స్థానిక శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట రామకృష్ణ, బ్రహ్మకుమారి స్థానిక సంచాలకులు బికే మనీషా, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కేశవరెడ్డి, రాధాకృష్ణా రెడ్డి, మెడికల్ ఆఫీసర్లు ఉమ,
ఎంఎల్ ఎన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు అర్జున్, తిరుపతి, రాజేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.శిబిరంలో 82 మంది
రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ
రక్తదానం పట్ల ఉన్న అపోహలను నివృత్తి చేశారు.రక్తదానం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు బ్రహ్మకుమారి సంస్థకు ఆయన
కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment