రబింద్ర ప్లే స్కూల్లో వెజిటబుల్ మార్కెట్ పై అవగాహన
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర ప్లే స్కూల్ లో శుక్రవారం విద్యార్థులకు కూరగాయల మార్కెట్ పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వివిధ రకాల కూరగాయలను తీసుకొచ్చి ప్రదర్శించారు. కూరగాయలను విక్రయించడం, కొనుగులు విధానం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు విక్రేతలుగా ఉండి కూరగాయలను విక్రయించడం చేశారు. విద్యార్ధులు ప్రస్తుతం ఉన్న ధరల ఆధారంగా వాటి వివరాలు వివరించారు. విద్యార్థులు కూరగాయలు విక్రయించేటప్పుడు ఎలా (తూకం) కొలవాలో నేర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అసంవర్ సాయినాథ్, కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యాదవ్, భీమ్ రావు దేశాయ్, ప్లే స్కూల్ ఇంచార్జ్ హేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.