మాసన్‌పల్లిలో ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డికి ఘన సన్మానం

మాసన్‌పల్లిలో ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డికి ఘన సన్మానం

కామారెడ్డి, జనవరి 16 (మనోరంజని తెలుగు టైమ్స్):

కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండలం మాసన్‌పల్లి గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డికి ఘనంగా సన్మానం నిర్వహించారు. రెడ్డి సంఘం అధ్యక్షుడు విఠల్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
సామాజిక, ఆధ్యాత్మిక సేవలతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో మనోహర్‌రెడ్డి చేస్తున్న విశేష కృషిని గుర్తించి ఆయనకు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ, మనోహర్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలను కొనసాగిస్తూ సమాజానికి మరింత మేలు చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు కిషన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సంజీవ్‌రెడ్డి, జైరాం రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment