తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్

Alt Name: డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
  • సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి డిప్యూటీ సీఎం గా నియామకం
  • 46 ఏళ్ల ఉదయనిధి ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు
  • ఈరోజు 3:30 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

 తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా నియమితులయ్యారు. గవర్నర్ ఆర్ ఎన్ రవి ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో, ఈరోజు 3:30 గంటలకు చెన్నై రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజకీయంగా ఇది ఉదయనిధికి పెద్ద పదవి అని, రాష్ట్రంకోసం నిబద్ధతతో పనిచేస్తానని ఉదయనిధి అన్నారు.

 తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం ఎంకే స్టాలిన్ తన కుమారుడు, స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం గా నియమించేందుకు ప్రతిపాదించారు, ఆ ప్రతిపాదనకు గవర్నర్ ఆర్ ఎన్ రవి శనివారమే ఆమోదం తెలిపారు.

ఉదయనిధి స్టాలిన్, యువజన సంక్షేమ మరియు క్రీడల శాఖ మంత్రిగా ఉన్నత పదవిని స్వీకరించిన తర్వాత, ఇప్పుడు మరింత బాధ్యతతో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగనుంది.

2021లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధి, గత ఏడాది డిసెంబరులో స్టాలిన్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. అప్పటి నుంచి, పార్టీ క్యాడర్ నుండి ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించాలని డిమాండ్ బలంగా వినిపించింది.

ఈ నిర్ణయంతో తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ పాత్ర మరింత బలపడనుందని అంచనా.

Join WhatsApp

Join Now

Leave a Comment