టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వేధింపులకు ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం!
అయినా కొలికపూడి తీరు మారదా!
పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు మరోసారి కొలికపూడి..
ప్రశాంతంగా ఉండే తిరువూరులో కులాల చిచ్చు పెట్టి గొడవలు పెట్టిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
గతంలో చిట్యాల గ్రామ సర్పంచ్ ను వేధింపులకు గురి చేయడం, వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్యతో ఎమ్మెల్యే కొలికపూడి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది
అలాగే కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణమంటూ ఒక ఇంటిని దగ్గరుండి కూలగొట్టించేందుకు ప్రయత్నించాడు.. అప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్లాడు
అయినా తీరు మారలేదు.. మళ్ళీ ఈనెల 11న గోపాలపురంలో అన్నదమ్ముల ఆస్తి తగాదా గొడవలో వెళ్లి తమ్ముడిని కొట్టి, తమ్ముడు భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది
వరుస ఘటనలతో.. ఎమ్మెల్యే తీరు మారడం లేదని ఇంకోసారి పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడిని పిలిచారు