తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు..

తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు..

తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు..

హైదరాబాద్‌: తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాయి. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్ కోసం 10 వేల మందితో బతుకమ్మ వేడుకను అధికారులు చేపట్టారు. మహా బతుకమ్మ దగ్గర గిన్నిస్‌ బుక్‌ రికార్డు సభ్యుల పర్యవేక్షణ చేశారు. ఈ నేపథ్యంలో మహా బతుకమ్మ కార్యక్రమం ఏకంగా రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. అతిపెద్ద జానపద నృత్యంగా తెలంగాణ బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డు సాధించింది. మరో రికార్డుగా 66.5 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ ఒకేసారి 1,354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్‌ రికార్డు క్రియేట్ చేశారు.

ఈ మేరకు తెలంగాణ బతుకమ్మ వేడుకకు 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి బతుకమ్మ వేడుక నమోదైంది. పది వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతుండగా గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకుని ఫలితాన్ని ప్రకటించారు. ఒకేసారి పది వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్‌ రికార్డుల్లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా మహా బతుకమ్మ కార్యక్రమం కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ మేరకు అధికారుల అంచనాలను మించి మహా బత్తుకమ్మ రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది

Join WhatsApp

Join Now

Leave a Comment