దసరా నవరాత్రుల్లో తుల్జా భవాని అమ్మవారి ప్రత్యేక పూజలు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ సెప్టెంబర్ 23
దసరా నవరాత్రుల సందర్భంగా నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల తుల్జా భవాని మాత ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. అలాగే భక్తురాలు వనితా సింగం కుటుంబ సభ్యులు తమ నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు. మంగళవారం అమ్మవారు గాయత్రీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోనూ, ఇళ్లలోనూ మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకురాలు సుజాత వేణు మాట్లాడుతూ—“ఈ తొమ్మిది రోజులు మహిళలు అమ్మవారిని దర్శించుకుని వెళ్లాలి. అలా చేస్తే గృహశాంతి, సంతానయోగం, కుటుంబ సమస్యల పరిష్కారం, మనశ్శాంతి—ఇవన్నీ తుల్జా భవాని అమ్మవారి అనుగ్రహంతో కలుగుతాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తుల జీవితాలు మరుక్షణమే మరో మలుపు తిరుగుతాయి.” అని తెలిపారు.