మంగనూరు, గౌరారంలో క్షయ నిర్ధారణ ప్రత్యేక శిబిరాలు విజయవంతం

మంగనూరు, గౌరారం గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం

ప్రత్యేక శిబిరాల ద్వారా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందించిన వైద్యులు

మంగనూరు, గౌరారం గ్రామాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం

నాగర్ కర్నూల్ జిల్లా:

టీబి (క్షయ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “క్షయ ముక్త్ భారత్ 100 రోజుల ప్రోగ్రాం” లో భాగంగా బీజినేపల్లి మండలంలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగనూరు, గౌరారం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారని లట్టుపల్లి వైద్యాధికారి డాక్టర్ బి. నారాయణ స్వామి తెలిపారు.

క్షయ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు

డాక్టర్ నారాయణ స్వామి మాట్లాడుతూ రెండు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు, నోటి ద్వారా రక్తం కారడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి క్షయ వ్యాధి నిర్ధారణ కోసం ప్రత్యేకంగా తేమడ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు.

శిబిరంలో వైద్య సేవలు

ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు రోగులను పరీక్షించి, చిరు వ్యాధులకు అవసరమైన చికిత్సలు అందించారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న, క్షయ వ్యాధి సూపర్వైజర్ శ్రీనివాసులు, బాలమని, ల్యాబ్ టెక్నీషియన్ బి. చంద్రశేఖర్, ఫార్మసిస్ట్ కే. శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు అబ్దుల్ సలీం, పి. జ్యోతి, ఎం. బోజ్జమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment