సత్యం–అహింస మార్గం మనకు మార్గదర్శకం : మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్

సత్యం–అహింస మార్గం మనకు మార్గదర్శకం : మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్

సత్యం–అహింస మార్గం మనకు మార్గదర్శకం : మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రొద్దుటూరు ప్రతినిధి అక్టోబర్ ౦2 

సత్యం–అహింస మార్గం మనకు మార్గదర్శకం : మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్

ప్రొద్దుటూరులోని మునిసిపల్ ఆఫీస్ ప్రాంగణంలో “మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్” ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు ఘటించి ఆయన ఆలోచనలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ – “గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవామార్గం నేటికీ మనకు మార్గదర్శకం. అలాగే, లాల్ బహదూర్ శాస్త్రిగారు ఇచ్చిన ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదం సమాజానికి ఎప్పటికీ ప్రేరణ. సమాజంలో నిజాయితీ, నీతి, ప్రేమను పెంపొందించుకోవాలంటే వారి ఆలోచనలు అనుసరించడం అత్యంత అవసరం” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, ట్రెజరర్ భార్గవ్ సాయి, రమణాచారి, ఆదినారాయణ, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిషెట్టి వెంకట లక్షుమ్మ, సుమన్ బాబు, సురేష్ మరియు స్థానికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment