భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి రెచ్చిపోయారు. భారత్ మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ‘రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి లాభం గడిస్తోంది. భారత్ చమురు కొనడం వల్లే ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తూనే ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాకు భారత్ పూర్తిగా సహకరిస్తోంది’ అని అన్నారు