గుండెపోటుతో మరణించిన టెక్నికల్ అసిస్టెంట్ కు నివాళి.
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
భీమారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గుండెపోటుతో మరణించిన టెక్నికల్ అసిస్టెంట్ దుగట భార్గవ్ కు నివాళి సమర్పించారు. ఈ సందర్భంగా భీమారం ఎంపీడీవో మధుసూదన్ మాట్లాడుతూ బెల్లంపల్లి మండలానికి చెందిన ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ దుగట భార్గవ్ అకాల మరణం చాలా బాధ కలిగించిందని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సతీష్ రెడ్డి, ఏపీఓ జీనత్, ఈసీ శ్రీనివాస్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ అనిల్, ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు నక్క రాజన్న, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.