- విద్యలో భారతీయ మూలాలను కలగలిపిన నానాజీ దేశ్ ముఖ్
- శ్రీ సరస్వతీ శిశుమందిరాలను స్థాపించి సదాచారం, సంస్కారం విద్యార్థులకు అందించిన వేదాంతి
- గ్రామీణ అభివృద్ధి, సస్యశ్యామల నేలల కలయి సామాజిక మార్పు చేసిన దార్శనికుడు
భారత రత్న, మహానేత నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా భారతీయ మూలాల విద్యావ్యవస్థను అందించడంలో ఆయన చేసిన కృషిని స్మరించుకుంటున్నాం. నానాజీ, శిశుమందిరాల స్థాపన ద్వారా సదాచారం, సామాజిక మరియు నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ విశ్వవిద్యాలయం స్థాపనతో పటిష్ఠమైన మార్పునకు పునాదులు వేశారు.
భారతీయ తాత్వికుడు, దార్శనికుడు మరియు భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నాం. భారతీయ మూలాలతో కూడిన విద్యావ్యవస్థను అందించడంలో నానాజీ దేశ్ ముఖ్ గొప్ప పాత్ర పోషించారు. మొట్టమొదట గోరఖ్ పూర్ లో శ్రీ సరస్వతీ శిశుమందిరాలను స్థాపించి, విద్యతో పాటు సదాచారం, సంస్కారం మరియు సామాజిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించారు.
నానాజీ దేశ్ ముఖ్ స్వయంగా పండిట్ దీనదయాళ్ జీ ప్రవచించిన ఏకాత్మ మానవతా వాదం మరియు అంత్యోదయ సిద్ధాంతాలను ఆచరించి చూపించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవిరల కృషిచేశారు. “ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు” అనే నినాదంతో వందలాది గ్రామాలను సస్యశ్యామలం చేసి, గ్రామీణ ప్రజలకు వెలుగులు నింపారు.
రూరల్ ఎడ్యుకేషన్, రూరల్ హెల్త్ మరియు రూరల్ సెల్ఫ్ రిలయన్స్ పట్ల నానాజీ దేశ్ ముఖ్ అమూల్యమైన కృషి చేశారు. విలువలతో కూడిన విద్య కోసం ఆయన గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. గ్రామ సేవలో జన్మచరితార్థం చేసుకున్న ఆయన జీవిత కీర్తి ఈరోజు యువతకు ఆదర్శం.