నిర్మల్ జిల్లా కొత్త డి.ఎస్.డి.ఓ దయానంద్‌కు ట్రస్మా అభినందన

నిర్మల్ జిల్లా కొత్త డి.ఎస్.డి.ఓ దయానంద్‌కు ట్రస్మా అభినందన

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి నిర్మల్ అక్టోబర్ 07

నిర్మల్: నూతనంగా నియమితులైన నిర్మల్ జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిఎస్‌డిఓ) దయానంద్‌ను ట్రస్మా (TRSMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన దయానంద్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా బి.ఏ.ఎస్ (BAS) స్కూల్స్‌కు సంబంధించిన పెండింగ్ బకాయిలు, వాటి చెల్లింపుల పరిస్థితులు, విద్యాసంస్థల సాధకబాధకాలు గురించి వివరించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ హై స్కూల్ కరస్పాండెంట్ నాగభూషణ్ , రవి హై స్కూల్ ఇంచార్జ్ లెలీనా, నిర్మల్ డిఇఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment