నగరంలో 8 మంది పోలీస్ అధికారుల బదిలీ

  • 8 మంది పోలీస్ అధికారులపై బదిలీ నిర్ణయం
  • అశోక్ నగర్ ఉద్రిక్తతలో దురుసుగా ప్రవర్తించిన కారణంగా చర్యలు
  • గ్రూప్ 1 అభ్యర్థుల ఫిర్యాదుతో పోలీస్ కమిషనర్ చర్యలు

 హైదరాబాద్ నగరంలో 8 మంది పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ, హైదరాబాదు పోలీస్ కమిషనర్ పీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అశోక్ నగర్ ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలో ఆందోళనకారులతో దురుసుగా ప్రవర్తించిన చిక్కడపల్లి సీఐ సీతయ్యతో సహా మొత్తం 8 మంది అధికారులపై బదిలీ వేటు పడింది.

: హైదరాబాద్ నగరంలో పోలీస్ అధికారులపై కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అశోక్ నగర్ ప్రాంతంలో గ్రూప్ 1 అభ్యర్థులతో జరిగిన ఉద్రిక్తత సమయంలో చీఫ్ ఇన్‌స్పెక్టర్ సీతయ్య సహా 8 మంది పోలీస్ అధికారులు ఆందోళనకారులతో దురుసుగా ప్రవర్తించారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అభ్యర్థులు తమపై జరిగిన లాఠీచార్జ్ విషయాన్ని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే మంత్రి, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో మాట్లాడి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ కమిషనర్ 8 మంది అధికారులను బదిలీ చేస్తూ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Comment