వైద్యులకు సీపీఆర్ పై శిక్షణ
బైంసా మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 14
నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యులు, మెడికల్ అధికారులకు 108 ఈఎంటి లక్ష్మణ్ పూజారి సీపీఆర్ పై అవగాహన కల్పించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రాజేందర్ సమక్షంలో జరిగిన ఈ శిక్షణలో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో వైద్య సహాయం అందించేందుకు వైద్య సిబ్బందిని సన్నద్ధం చేస్తుంది. ప్రతి ఈఎంటి సిబ్బంది ఇలాగే అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.