నిర్మల్, 2026-08-26
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అడ్డదిడ్డంగా ఆటోల పార్కింగ్తో అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆసుపత్రి ప్రధాన గేటు ఎదుటే ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా ఆటోలను నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద అడ్డదిడ్డంగా ఆటోల పార్కింగ్తో అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆసుపత్రి ప్రధాన గేటు ఎదుటే ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా ఆటోలను నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర వేళల్లో క్షతగాత్రులు, తీవ్ర అస్వస్థతకు గురైన రోగులను ఆసుపత్రికి తీసుకువచ్చే అంబులెన్స్‌లకు గేటు వద్ద నుంచి వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అంబులెన్స్ డ్రైవర్ల ఆవేదన
అత్యవసర పరిస్థితి అని తెలిపినా కొందరు ఆటో డ్రైవర్లు వాహనాలను పక్కకు తీయడం లేదని అంబులెన్స్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి ప్రధానంగా ఒక్కటే గేటు ఉండటంతో అక్కడి అడ్డగోలు పార్కింగ్ కారణంగా రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజల విజ్ఞప్తి
అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆసుపత్రి గేటు వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అడ్డగోలు పార్కింగ్‌ను నియంత్రించి.. అంబులెన్స్‌లకు దారి సుగమం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.












