బోత్, 2026-08-31
బోత్ ఎక్స్ రోడ్డులో రాత్రి వేళల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఆదేశించారు. బోత్, సోనాల మండలాల ప్రజల విజ్ఞప్తి మేరకు సోమవారం ఆయన ఎక్స్ రోడ్డును పరిశీలించారు.

జాతీయ రహదారిపై బోత్ ఎక్స్ రోడ్ వద్ద రాత్రి సమయంలో సరైన వెలుతురు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన గోడం నగేశ్.. ఎక్స్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్ల వద్ద సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌ను ఆదేశించారు.
వారం రోజుల్లోగా లైట్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్స్ రోడ్డులో వెలుతురు సౌకర్యం కల్పించడం ద్వారా రాత్రి వేళల్లో ప్రయాణికులు, వాహనదారులకు భద్రత మరింత మెరుగుపడుతుందని ఎంపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాటిపల్లి గంగాధర్‌రావు, మాజీ రైల్వే బోర్డు సభ్యుడు జి.వి.రమణ, సీనియర్ నాయకులు గాదె శంకర్, బొండ్ల వెంకటస్వామి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.