జగిత్యాల: మానవత్వాన్ని చాటుకున్న ట్రాఫిక్ ఎస్సై
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం పాత బస్టాండ్ సమీపంలో పూలు అమ్ముకునే సలీం అనే వ్యక్తి ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దసరా, బతుకమ్మ పండగల రద్దీలో ఎవరూ పట్టించుకోకపోయినా, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ సలీంను తన వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనతో సలీం కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు ఎస్సై మల్లేష్ ను రియల్ హీరోగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు